‘విస్తారా ఎయిర్‌లైన్స్‌’కు తప్పిన ప్రమాదం

Vistara Flight
Vistara Flight

న్యూఢిల్లీ: ‘విస్తారా ఎయిర్‌లైన్స్‌’కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబయి నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ 153 మది 153 మంది ప్రయాణికులతో సోమవారం మధ్యాహ్నం 3.30గంటలకు ముంబయి నుంచి బయలుదేరి సాయంత్రం 5గంటలకు దిల్లీకి చేరింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో దిల్లీ విమానాశ్రయంలో దిగేందుకు అనుమతి లభించలేదు. దీంతో సమీపాన ఉన్న లఖ్‌నవూకు వెళ్లాలని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది సూచించారు. పైలట్‌ అందుకనుగుణంగానే అక్కడికి చేరకున్నారు. కానీ, అక్కడా వాతావరణ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో వారు మళ్లీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని కోరారు. ప్రయాగ్‌రాజ్‌కి సమీపాన ఉన్న తరుణంలో పరిస్థితులు చక్కబడ్డాయని.. తిరిగి లఖ్‌నవూకి రావాలని పైలట్‌కు మరో సందేశం అందింది. లఖ్‌నవూలో ప్రయాణికులకు మెరుగైన వసతులు ఉండడంతో తిరిగి అక్కడికే వెళ్లాలని పైలట్‌ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విమానంలో ఉన్న అదనపు ఇంధనం అయిపోవస్తోంది. మరో పది నిమిషాలైతే ఇంధనం పూర్తిగా అయిపోతుందన్న సమయంలో పైలట్‌ లఖ్‌నవూ విమానాశ్రయానికి అత్యవసర సిగ్నల్‌ అయిన మే డే కాల్‌ పంపించారు. దీంతో అప్రమత్తమైన అక్కడి సిబ్బంది వెంటనే విమానం ల్యాండింగ్‌కు అన్ని అనుమతులిచ్చారు. విమానం సురక్షితంగా దిగింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో పది నిమిషాలు విమానం గాల్లోనే ఉండి ఉంటే దాదాపు 153 మంది ప్రాణాలకు అపాయం పొంచి ఉండేదే.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/