ఆలయాలను సందర్శిస్తా : చినజీయర్ స్వామి

రామతీర్థం ఆలయ నిర్మాణానికి ఆగమశాస్త్ర సూచనలు

Chinna Jeeyar Swamy
Chinna Jeeyar Swamy

Vijayanagarm: రాష్ట్రంలో ఆలయాలను ఈ నెల 17 వ తేదీ నుంచి సందర్శిస్తానని  చినజీయర్ స్వామి తెలిపారు. రాష్ట్రంలో విగ్రహల ధ్వంసం, దాడులు జరిగిన ఆలయాలన్నిటినీ సందర్శిస్తానని తెలిపారు  ఆలయాలపై దాడులు, విగ్రహాల  ధ్వంసం చేస్తున్న ఘటనపై  ఆందోళన వ్యక్తం చేశారు.

రామతీర్థం ఘటన ఆలయాల భద్రతకు సంబంధించి మేలుకొలుపు వంటిదన్నారు. ప్రభుత్వం అన్ని ఆలయాలకు తగిన భద్రత కల్పించాలని కోరారు. ఆయన  విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరామస్వామి ఆలయాన్ని సందర్శించారు.

రాముడి విగ్రహం తల నరికిన ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్న చినజీయర్, అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన పర్యటనకు రాజకీయాలతో సంబంధంలేదని స్పష్టం చేశారు.  రామతీర్థం ఆలయ నిర్మాణానికి ఆగమశాస్త్ర సూచనలు చేశానని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/