విశ్వ‌క్‌సేన్ ‘పాగ‌ల్’ ఫ‌స్ట్‌లుక్

ఏప్రిల్‌ 30న రిలీజ్‌

విశ్వ‌క్‌సేన్ 'పాగ‌ల్' ఫ‌స్ట్‌లుక్
Vishwak sen ‘Paagal’ first look

యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ఇటీవ‌ల `హిట్` చిత్రంలో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం విశ్వ‌క్‌సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 
`పాగల్`. మ్యాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. 

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ రోజు పాగ‌ల్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో పాటు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న  విడుదల‌చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. 

ఈ పోస్ట‌ర్‌లో విశ్వ‌క్‌సేన్ యూబ‌ర్‌కూల్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో గులాబిపూలు ప్రేమ‌ను, స్వ‌చ్చ‌త‌ను సూచిస్తున్నాయి. 

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/