విశ్వక్ సేన్ కొత్త చిత్రానికి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్

అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్..ఈరోజు తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్లో తన కొత్త చిత్రాన్ని ఈరోజు గురువారం హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా సినీ నటుడు , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై ఓపెనింగ్ కు హైలైట్ అయ్యారు. అలాగే మంచు విష్ణు, ప్రకాశ్​రాజ్​ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ మూవీ లో అర్జున్​ కూతురు ఐశ్వ‌ర్యా అర్జున్ హీరోయిన్ కావడం విశేషం. ముహూర్తపు సన్నివేశానికి పవన్​ క్లాప్​ కొట్టి అల్ ది బెస్ట్ తెలిపారు. కాసేపు సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు పవన్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలతో, మరోపక్క రాజకీయ సభ లతో బిజీ గా ఉన్నారు. అక్టోబర్ నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యనే భీమ్లా నాయక్ తో ప్రేక్షకుల పలకరించారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. క్రిష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా , ఏ ఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ ని విడుదల చేయబోతున్నారు.