ఓయో రూమ్ లో సేద తీరిన విష్ణు ప్రియ

ఈ మధ్య బుల్లితెర యాంకర్ల స్టయిల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు యాంకర్లు అంటే ఇలాగే ఉండేవారని అంత మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు యాంకర్ల తీరే మారిపోయింది. హాట్ హాట్ అందాల ఆరబోత తో బుల్లితెర ను కాస్త వెండితెర గా మార్చేసి మసాలా దంచికొడుతున్నారు. అనసూయ , రేష్మి , శ్రీముఖి లతో పాటు విష్ణు ప్రియ సైతం అందాల ఆరబోత చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా అందాలు ఆరబోస్తూ యువతకు స్పెషల్ కిక్కిస్తోంది. ఆమె చేస్తున్న డాన్స్ వీడియోలు, పోస్ట్ చేస్తున్న హాట్ ఫొటోస్ ఎప్పటికప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ భామ ఓయో రూమ్ లో సేద తీరినట్లు చెప్పుకొచ్చింది. తాను పాల్గొనబోతున్న షూటింగ్ కాస్త లేట్ అవుతుందని తెలియడంతో ఓయో రూమ్ తీసుకొని అక్కడ సేద తీరానని చెప్పిన విష్ణు ప్రియ.. ఓయో రూమ్స్ చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని చెప్పింది. ఫుల్లుగా సంతృత్తి చెందానని పేర్కొంది. తన బిజీ షెడ్యూల్‌లో ఓయోలో టైమ్ స్పెండ్ చేయడం ఓ అద్భుతమైన అనుభవం అని, ఓయో రూమ్స్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అని తెలిపింది. ఈ మేరకు ఓయో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని క్రెటా కార్ గెలుచుకునే అవకాశం దక్కించుకోండి అని పేర్కొన్న విష్ణు ప్రియ.. ఓయో రూమ్‌లో డిస్కౌంట్ కోసం ఓ కోడ్ కూడా పోస్ట్ చేస్తూ ఆఫర్ ఇచ్చింది. ఈమె చెప్పినదానిని బట్టి చూస్తే ఓయో ప్రమోషన్ కోసం ఇలా పోస్ట్ పెట్టినట్లు అర్ధమవుతుంది.