సభలు , రోడ్ షోస్ నిషేధం ఫై వైస్సార్సీపీ సర్కార్ ఫై విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు

ఇక ఫై రాష్ట్రంలో ఎలాంటి రోడ్ షోస్ కానీ సభలు , ర్యాలీ లు కానీ జరపరాదని రాష్ట్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీచేయడం ఫై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అధికార పార్టీకి ఒక రకరమైన నిబంధనలు, విపక్ష పార్టీలకు మరో రకమైన నిబంధనలు విధించడం సరికాదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభలో ప్రజలు చనిపోవడం బాధాకరమని… ఈ ఘటనపై సభ నిర్వాహకులపైన లేదా టీడీపీపైన చర్యలు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని… సభకు అనుమతులు కోరిన వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.

భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా ప్రభుత్వం సక్రమమైన నిర్ణయాలను తీసుకోవాలే కానీ… విపక్ష పార్టీలు సభలే జరపకుండా చూడాలనుకోవడం సరి కాదని విమర్శించారు. పోలీసుల మార్గదర్శకాలకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు సభలను నిర్వహించుకుంటాయని… రాజకీయ పార్టీల సభలకు అనుమతులు ఇవ్వాలని అన్నారు. విపక్షాల సభలే జరగకుండా చూడాలని ప్రభుత్వం యత్నిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయని… దీనిపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని విష్ణువర్ధన్ డిమాండ్ చేసారు.

రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సభల్లో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కందుకూరు లో ఏర్పాటు చేసిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించగా..గుంటూరు లో జరిగిన సభలోనే అదే జరిగింది. చంద్రన్న చీరల పంపిణి లో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు కన్నుమూశారు. ఇలా రెండు చోట్ల తొక్కిసలాటలు జరగడం తో పలువురు మరణించడం తో..ఏపీ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా..ఇకపై రోడ్లపై సభలు, ర్యాలీలని నిషేదిస్తున్నట్లు రాష్ట్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టుకోవాలని సూచించింది. ఈ నియమాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపై, అలాగే మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని తెలిపింది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఖచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వచ్చని మినహాయింపు ఇచ్చింది. ఇక ఇలా రూల్ పెట్టడంతో ఇకపై చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయి.