రేపు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించబోతున్నారు

రేపు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించబోతున్నారు

మా ఎన్నికలు..పొలిటికల్ ఎన్నికలను మించేలా వాడి వేడిగా నడుస్తున్నాయి. అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబదించిన నోటిఫికేషన్ రీసెంట్ గా విడుదలైంది. ఈ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు ల మధ్య పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను పరిచయం చేసి ప్రచారం చేస్తున్నారు. ఇక మంచు విష్ణు సైతం రేపు తన ప్యానల్ సభ్యులను ప్రకటించబోతున్నారు.

ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్‌లో బాబు మోహన్, రఘుబాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, జనరల్ సెక్రెటరీగా రఘు బాబు ఉండునున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా.. ప్రకాష్ రాజ్ ప్యానల్‏కు ధీటుగా సీనియర్ నటులను సైతం మంచు విష్ణు రంగంలోకి దించనున్నట్లుగా తెలుస్తోంది.