హీరో విశాల్‌ కాలు, చేయికి గాయాలు

Vishal
Vishal

చెన్నై: ప్రముఖ కోలీవుడ్‌ హీరో,నడిగర్‌ సంఘానికి అధ్యక్షుడు విశాల్‌కు షూటింగ్‌లో తీవ్రగాయాలయ్యాయి. సినిమా షూటింగ్ సమయంలో సన్నివేశం తీసే క్రమంలో ప్రమాదం జరిగింది. దీంతో ఆయన ఎడమ కాలు, చేయి విరిగాయి. టర్కీలో సినిమా షూటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఆయనను చిత్ర బృందం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. డూప్ లేకుండా ఓ ఫైట్ సీన్ తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.


మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/