జగన్ ను సీఎం స్టాలిన్ ఫాలో అవ్వాల్సిందే అంటూ హీరో విశాల్ కామెంట్స్

జగన్ ను సీఎం స్టాలిన్ ఫాలో అవ్వాల్సిందే అంటూ హీరో విశాల్ కామెంట్స్

తమిళ హీరో విశాల్..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై ప్రశంసల జల్లు కురిపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ..జగన్ ను ఫాలో కావాల్సిందే అన్నారు. తాజాగా జగన్ రాష్ట్రంలోని థియేటర్లలో ఆన్ లైన్ టికెట్స్ విధానం చేయాలనీ..అందుకే ప్రత్యేక పోర్టల్ సిద్ధం చేయాలనీ ఆదేశించిన సంగతి తెలిసందే. ఈ క్రమంలో జగన్ తీసుకున్న నిర్ణయం ఫై హీరో విశాల్ స్పందించారు.

‘‘ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌గారికి హ్యాట్సాఫ్‌. ఎందుకంటే ఆయ‌న సినిమా ఆన్‌లైన్ టికెట్స్ విధానాన్ని ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హించ‌నుంద‌నే నిర్ణ‌యం తీసుకుంది. ఇలాంటి ప‌ద్ధ‌తి త‌మిళ‌నాడులో పెడితే బావుంటుంద‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాం. ఇలా చేస్తే వంద‌శాతం పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంది. ఇలాంటి విష‌యం జ‌ర‌గడం సినీ ప‌రిశ్ర‌మ ఆనందించాల్సి విష‌య‌మే. దీన్ని అంద‌రూ స్వాగ‌తించాలి. గౌర‌వ‌నీయులైన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎం.కె.స్టాలిన్‌గారు ఇలాంటి ప‌ద్ధ‌తిని త‌మిళ‌నాడులో తీసుకొస్తే బావుంటుంది. అలా చేస్తే థియేట‌ర్స్ క‌లెక్ష‌న్స్ విష‌యంలో పార‌దర్శ‌క‌త క‌నిపిస్తుంది. సినీ ఇండ‌స్ట్రీకి, ప్ర‌భుత్వానికి ఇదొక వ‌రం’’ అని విశాల్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసారు.