షూటింగ్ లో గాయపడ్డ హీరో విశాల్

తమిళ హీరో విశాల్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డాడు. ప్రస్తుతం విశాల్ లాఠీ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర క్లైమాక్స్ షూటింగ్ లో ఈయన గాయపడ్డారు. పోరాట సన్నివేశాల్లో రియల్​ స్టంట్​లు చేస్తూ ఇప్పటికే పలుసార్లు గాయపడిన విశాల్.. ​తాజాగా మరోసారి తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. గతంతో పోలిస్తే ఈ సారి మరింత ఎక్కువగా దెబ్బలు తగిలాయని సమాచారం.

‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచమైన విశాల్.. ‘పొగ‌రు’, ‘అభిమ‌న్యుడు’ తదితర సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న నాలుగు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. అందులో ‘లాఠీ’ ఒక‌టి. ఎ.వినోద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డాడు. ఈ ఘటనలో విశాల్​ కాలికి బాగా దెబ్బలు తగిలినట్లు సోషల్​మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో షూటింగ్​ను తాత్కాలికంగా నిలిపివేసి.. వెంటనే చికిత్స కోసం ఆయన కేరళ వెళ్లారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విశాల్​ త్వరగా కోలుకోవాలని, ఇలాంటి రిస్క్​ షాట్​లు చేయొద్దని కోరుతున్నారు. అంతకుముందు హైదరాబాద్​లో ఇదే సినిమా చిత్రీకరణ సమయంలోనూ విశాల్​కు గాయాలు అయ్యాయి. అప్పుడూ షూటింగ్​ ఆపేసి కేరళ వెళ్లి చికిత్స తీసుకున్నారు.

రమణ, నంద సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా గా నిర్మిస్తున్నారు. సనయన హీరోయిన్. ఇక ఈ మూవీ లో విశాల్​ ఓ పవర్ ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు. యాక్షన్‌కు ప్రాధాన్యమున్న చిత్రమిది. చిత్ర సెకండ్ హాఫ్ లో ఉండే 45నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ పోరాట ఘట్టాలకు దిలీప్‌ సుబ్బరాయణ్‌ నేతృత్వం వహించారు.