క్లీనెస్ట్‌ రైల్వేస్టేషన్‌గా విశాఖ

Visakha Railway Station
Visakha Railway Station

క్లీనెస్ట్‌ రైల్వేస్టేషన్‌గా విశాఖ

వాల్తేరు డిఆర్‌ఎం ముఖుల్‌ శరణ్‌ మాథూర్‌

విశాఖపట్నం: భారతదేశంలో అన్ని రైల్వేస్టేషన్‌లలో కల్లా, క్లీనెస్ట్‌ రైల్వే స్టేషన్‌గా విశాఖ రైల్వే స్టేషన్‌కు అవార్డు వచ్చిందని వాల్తేరు డివిజన్‌ రైల్వే మేనేజర్‌ ముఖుల్‌ శరణ్‌ మాథూర్‌ తెలిపారు బుధవారం సాయంత్రం డిఆర్‌ఎం కార్యాలయ సమావేశం మందిరంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ రైల్వేస్టేషన్‌కు ఈ అత్యుత్తమ అవార్డు రావడం వెనుక తన సిబ్బంది కృషి, రాష్ట్ర ప్రభుతం సహకారం, ప్రజల సహకారం ఉందన్నారు. స్వచ్చభారత్‌ పహాడా భాగంగా ఇండియా టుడే గ్రూప్‌ ఈ అవార్డులను నిర్వహించిందన్నారు. విశాఖ రైల్వేస్టేషన్లలో రోజుకు డెబ్బై వేల మంది ప్యాసింజర్లు, భారత దేశమంతటా రెండు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. స్వచ్చ భారత్‌ స్వచ్చ రైల్‌ పేరిట ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విశాఖ రైల్వే స్టేసన్‌కు రోజుకు 120 ట్రైన్‌లు చేరుకుంటాయన్నారు. రోజుకి 40 ట్రైన్‌లు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరుతున్నాయన్నారు. ప్రతి రైలు కనీసం ఇరవై నిమిషాల పాటు హాల్టింగ్‌ ఉంటుందన్నారు. స్టేషన్‌ నుంచి ప్రతి రైలు కదిలిన వెంటనే ట్రాక్‌ మొత్తం వెంట వెంటనే ట్రాక్‌ మొత్తం క్లీన్‌ చేయడం జరుగుతుందన్నారు. ఈ ట్రాక్‌లను క్లీన్‌ చేయడానికి రోజుకి ఐదు లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు. విశాఖను ఇంటిగ్రేటెడ్‌ మెఖనైజ్‌డ్‌ క్లీనింగ్‌ స్ట్రేజీగా పని, చేస్తోందన్నార. ప్లాట్‌పాహ్స, ట్రాక్‌, టాయిలెట్‌ బ్లాక్‌లో రోజుకు ఐదుసార్లు క్లీనింగ్‌ జరుగుతుందన్నారు. ఏడు జెట్‌ మిషిన్స్‌, నాలుగు స్కబ్బర్స్‌, రెండు వ్యాక్యూమ్‌ క్లీనర్‌, రెండు స్టీమ్‌ క్లీనర్స సామగ్రిని వినియోగించడం జరుగుతుందన్నారు. 900 క్యూబిక్‌ మీటర్ల వ్యర్ధ పదార్ధాలను సేకరించి బయటకు పంపడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ్‌భారత్‌ డస్ట్‌బిన్‌లను ప్రతి ప్లాట్‌పామ్‌కు ఐదు, పది మీటర్లకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎల్‌ఇడి వెలుగులను స్టేషన్లలో వెలిగించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయన్నారు. విశాఖ రైల్వే స్టేషల్‌ పాటు విజయనగరం, దువ్వాడ అరుకు, ఇలా డివిజన్‌ పరిధిలో ఉన్న అనేక రైల్వేస్టేషన్లలో స్వచ్చ్‌తా స్లోగన్లను ఇచ్చామన్నారు. ప్రయాణికులు, విద్యార్ధులలో అవగాహాన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించామన్నారు. ఇండియా టుడే గ్రూప్‌ అనేక ప్రమాణాలను నిర్ధారించాక విశాఖకు క్టీనెస్ట్‌ రైల్వే స్టేషన్‌ ఎంపికావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. విశాఖ నుంచి ప్రారంభమ్యే రైళ్లులో ఇతర ప్రాంతాలకు తరలించే ఆలోచనేమీలేదన్నారు. విశాఖలో 9,10 ప్లాట్‌ ఫామ్‌లను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు.