భారత్‌ లో వైరస్‌ వేగం ఈ వారమే తెలుస్తుంది

రాబోవు రెండు వారాలు అత్యంత కీలకమైనవని నిపుణుల అంచన

corona virus
corona virus

దిల్లీ: భారత్‌ లో తొలి కరోనా కేసు నమోదు అయ్యి నేటికి సరిగ్గా రెండు నెలలు అవుతుంది. దేశంలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు పిబ్రవరి 1న నమోదు అయింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1000 దాటింది. అయితే రాబోవు రెండు వారాలు జాతి భవిష్యత్‌కు అత్యంత కీలకం కానుంది. దేశంలో కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుందనేది ఈ వారంలో తేలుతుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో విధించిన లాక్‌డౌన్‌ ఎంత మేరకు అడ్డుకుంటుందనేది ఈ వారంలోనే తెలియనుంది. అయితే పరిస్థితి మరీ దారుణంగా… అంటే చైనాలో మాదిరిగా ఇక్కడ కూడా విస్తరించినట్లయితే వారంలో కరోనా కేసుల సంఖ్య 9,140 కి చేరుకుంటుందని, ఒకవేళ అతి తక్కువగా.. అంటే జపాన్‌లో మాదిరిగా ఉంటే 1,524 కి చేరుతుందని అంచనా వేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/