విరూపాక్ష కు బ్రహ్మ రధం పడుతున్న ఓటిటి ప్రేక్షకులు

సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీ కి ఓటిటి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు రూపొందించిన హర్రర్ మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించగా , శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.

ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మొదటి ఆట తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మే 20 శనివారం అర్థరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ పోటీపడుతున్నారు. సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో.. థియేటర్ లో మిస్ అయినా వాళ్ళు ఓటీటీలో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీలో కూడా ఈ సినిమా దుమ్ముదులిపేయడం ఖాయమని ఫిలిం వర్గాలు అంటున్నారు.