విరూపాక్ష 5 డేస్ కలెక్షన్స్

Virupaksha Movie Talk ..

కథలో దమ్ముంటే ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మ రధం పడతారని మరోసారి విరూపాక్ష మూవీ తో రుజువైంది. సాయిధరమ్ తేజ్ – సంయుక్త మీనన్ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 21 న గ్రాండ్ గా విడుదలైంది.

మొదటి రోజు మొదటి ఆట తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను చూసేందుకు పోటీపడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది. నాల్గు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన విరూపాక్ష..ఐదు రోజుల కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ.1.04 కోట్లు సీడెడ్ లో రూ.34 లక్షలు యూఏలో రూ.33 లక్షలు తూర్పు రూ.19 లక్షలు పశ్చిమ రూ.11 లక్షలు గుంటూరు రూ.14 లక్షలు కృష్ణ రూ.15 లక్షలు నెల్లూరు రూ.7 లక్షలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో నైజాంలో రూ.9.56 కోట్లు సీడెడ్ లో రూ.3.16 కోట్లు యూఏలో రూ.2.78 కోట్లు తూర్పు రూ.1.51 కోట్లు పశ్చిమ రూ.1.08 కోట్లు గుంటూరు రూ.1.52 కోట్లు కృష్ణ రూ.1.44 కోట్లు నెల్లూరు రూ.72 లక్షలు రాబట్టింది. ఇలా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.21.77 కోట్లు షేర్ రూ.37.25 గ్రాస్ వసూళ్లను సాధించింది.