లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌

virendra kumar
virendra kumar


న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీ ఎంపి వీరేంద్ర కుమార్‌ నియామకం అయ్యారు. 17వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలతో వీరేంద్రకుమార్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నెల 19న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు ప్రొటెం స్పీకర్‌.ఈయన లోక్‌సభకు ఏడుసార్లు ఎన్నికైనారు. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌ గర్హ్‌ నియోజకవర్గం నుంచి వీరేంద్ర కుమార్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/