16 పచ్చబొట్లు పొడిపించుకున్న కోహ్లీ అభిమాని

Virat kohli tattoos on fan body
Virat kohli tattoos on fan body

భువనేశ్వర్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ఓ అభిమాని తన ప్రేమను వినూత్నంగా ప్రదర్శించాడు. సాధారణంగా విరాట్‌ కోహ్లీకి అభిమానులు కాస్త ఎక్కువగానే ఉన్నారు. అతడి బ్యాటింగ్‌కు అందరూ ఫిదా అవుతారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి అభిమానమే ఓ ఫ్యాన్‌ చేత ఒళ్లంతా కోహ్లీ రూపాన్ని పచ్చబొట్లు పొడిపించుకునేలా చేసింది. ఒడిశాకు చెందిన పింటు బహేరా అనే ఓ యువకుడు కోహ్లీ రూపంతో పాటు జెర్సీ నంబరు సహా మొత్తం 16 పచ్చ బొట్టను పొడిపించుకున్నాడు. పింటూ మాట్లాడుతూ.. కోహ్లీ బ్యాటింగ్‌కు నేను వీరాభిమానిని, పచ్చబొట్లతో ఆయనపై గౌరవాన్ని చాటాలనుకున్నాను. అందుకే ఇలా చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/