అధ్యక్షుడి హోదాలో ఉండే గంగూలీని కలుస్తా

గంగూలీకి అభినందనలు

Virat-Kohlis-Sourav-Ganguly
Virat-Kohlis-Sourav-Ganguly

కోల్‌కతా:టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ గురించి బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు గంగూలీ తనతో ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఘన విజయం సాధించిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ, కొత్త అధ్యక్షుడు గంగూలీకి అభినందనలు తెలియజేశాడు. గంగూలీ అధ్యక్షుడిగా రానుండటం చాలా గొప్పగా ఉందని చెప్పాడు. అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత తాము టచ్ ఉంటామని… అయితే, గంగూలీని తానే ముందుగా కలుస్తానని తెలిపాడు. ఇప్పటి వరకు జట్టు గురించి కానీ, ధోనీ గురించి కానీ గంగూలీ తనతో మాట్లాడలేదని చెప్పాడు. అక్టోబర్ 24న బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉండే గంగూలీని కలుస్తానని తెలిపాడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/