కోహ్లీ చేతికి గాయం

Virat Kohli
Virat Kohli

న్యూఢీల్లీ: బుధవారం విండీస్ తో జరిగిన మూడో వన్డే 27వ ఓవర్ లో విండీస్ బౌలర్ కీయర్ రోచ్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ కుడి చేతికి గాయమైంది. అయినా విరాట్ గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలోనే గాయం కారణంగా విండీస్ తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కు కోహ్లీ దూరం అవుతాడనే వార్తలు జోరుగా వచ్చాయి. ఈ వార్తలపై విరాట్ స్పందించాడు. మ్యాచ్ లో గాయమైన మాట వాస్తవమే, కానీ విండీస్ జరిగే తొలి టెస్టు మ్యాచ్ లో ఆడుతున్నానని ప్రకటించాడు. అయితే బుధవారం విండీస్ తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/