రేపటి సెమీస్‌లో టాసే కీలకం

Virat kohli
Virat kohli

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ల మధ్య రేపు సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మీడియాతో మాట్లాడుతూ..న్యూజిలాండ్‌ జట్టు బలమైన టీమ్‌ అని, ఈ జట్టుకు బౌలింగే ప్రధాన బలమని అన్నాడు. రేపటి మ్యాచ్‌లో టాస్‌ కీలకమని, సెమీస్‌కు చేరడంతో టీమ్‌ కొంత ప్రశాంతంగా ఉందని అన్నాడు. భారత జట్టులో రోహిత్‌శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని అన్నాడు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/