కోహ్లీపై మండిపడుతున్న అభిమానులు

ఎంత కెప్టెన్‌ అయితే మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావా అని ఫైర్‌

Virat Kohli
Virat Kohli

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. శనివారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో కూడా కోహ్లీ (3) దారుణంగా విఫలమయ్యాడు. టీమ్ సౌథీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన కోహ్లీ.. ఏ మాత్రం ఆలోచించకుండా డీఆర్‌ఎస్ సమీక్షకు వెళ్లాడు. అయితే అతడు తీసుకున్న ఈ నిర్ణయమే అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అది ఔట్‌ అని స్పష్టంగా తెలుస్తున్నా, ఎందుకు రివ్యూ తీసుకున్నావని, అనవరంగా ఓ రివ్యూను వృథా చేశావని కోహ్లీపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. టెస్ట్‌ల్లో ఒక బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ 14 సార్లు రివ్యూలు కోరితే రెండు సార్లు మాత్రమే సక్సెస్‌ అయ్యాడు. బ్యాట్స్‌మన్‌‌గా కోహ్లీ కోరిన 14లో 9 వ్యతిరేకంగా రాగా, మూడు అంపైర్స్‌ కాల్స్‌ అయ్యాయి. ఇక రెండు మాత్రమే కోహ్లికి అనుకూలంగా వచ్చాయి. అయితే తన రివ్యూ గణంకాలను ప్రస్తావిస్తూ ఫ్యాన్స్ ఈ రన్‌మిషెన్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. క్రికెట్‌ అనేది టీమ్ గేమ్‌.. కోహ్లీది ఒక్కడిదే కాదు. జట్టు గురించి ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఒకరు.. టెస్టుల్లో తన ఎల్బీ నిర్ణయాల్లో 15 శాతం మాత్రమే సక్సెస్‌ అయిన విషయాన్ని కోహ్లి గుర్తించుకోవాలి’ అని ఇంకొకరు.. కెప్టెన్‌గా అధికారం ఉందని జట్టు ప్రయోజనాల్ని తాకట్టుపెట్టి డీఆర్‌ఎస్‌ నిర్ణయాలను తీసుకుంటావా?’ అని మరొకరు మండిపడ్డారు. అతను వరుసగా విఫలమవడంతోనే విమర్శకులు కోహ్లీపై మాటల దాడికి దిగుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/