స్మిత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కోహ్లీ

steve smith & virat kohli
steve smith & virat kohli

ముంబయి: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసిసి) ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్‌ల్లో భారత సారథి విరాట్‌ కోహ్లీ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవలే బంగ్లాతో జరిగిన డే నైట్‌ టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ శతకం బాదిన విషయం తెలిసిందే. ఈ శతకంతో కోహ్లీ స్థానం 928 పాయింట్లకి పెరిగి మొదటి స్థానంలో నిలబడ్డారు. అంతకు ముందు ఈ స్థానంలో స్మిత్‌ ఉండగా పాక్‌తో జరిగిన రెండో టెస్టులో కేవలం అతడు 36 పరుగులు చేసినందున రేటింగ్‌ పాయింట్లు 931నుంచి 923కు పడిపోయింది. అజింక్య రహానే ఒక స్థానం తగ్గి ఆరో ర్యాంకుకు చేరుకోగా, తన నాలుగో స్థానంలో పదిలంగా ఉన్నాడు ఛెతేశ్వర్‌ పుజారా. ఇంక బౌలింగ్‌లో రవి చంద్రన్‌ అశ్విన్‌ తొమ్మిదో ర్యాంకులో ఉన్నారు. బుమ్రా ఐదో స్థానంలో ఉన్నారు. కాగా టాప్‌-10లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10 బ్యాట్స్‌మెన్‌ 1.విరాట్‌ కోహ్లీ-928 పాయింట్లు, 2. స్టీవ్‌ స్మిత్‌-923, 3. కేన్‌ విలియమ్సన్‌-877, 4.ఛెతేశ్వర్‌ పుజారా-791, 5. డేవిడ్‌ వార్నర్‌-764, 6.అజింక్య రహానే-759, 7. జో రూట్‌-752, 8. మార్నస్‌ టాబుస్చాగ్నే-731, 9. హెన్రీ నికోల్స్‌-726, 10. దిముత్‌ కరుణరత్నే-723

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/