ప్రపంచ రికార్డుకు చేరువలో కోహ్లి!

Virat Kohli
Virat Kohli, team india captain

మాంచెస్టర్‌: రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి మరో ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచుల్లో కోహ్లి 37 పరుగులు చేసినట్లయితే అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో 20 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ మ్యాచులో ఇదే గనక జరిగితే తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయి చేరుకున్న తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
ప్రస్తుతం అంతర్జాతీయ కెరీర్‌లో కోహ్లి ఈ రికార్డును సాధిస్తే 20 వేల పరుగులు పూర్తి చేసుకున్న పన్నెండో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి అవతరించనున్నాడు. కేవలం 416 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి అరుదైన రికార్డు సృష్టిస్తాడు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/