వెస్టిండీస్‌ టూర్‌కు కోహ్లి, బుమ్రాలు దూరం?

వీరికి బిసిసిఐ విశ్రాంతి

Virat Kohli ,Jasprit Bumrah
Virat Kohli ,Jasprit Bumrah

ముంబై: ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ సందర్బంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రాలకు విశ్రాంతినివ్వాలని సెలక్షన్‌ కమిటీ భావిస్తుంది. ఆగస్టు మూడు నుంచి అమెరికాలో నెలరోజుల పాటు జరగనున్న టూర్‌లో భారత జట్టు మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఏడాది కాలం నుంచి విరామం లేకుండా ఆడుతున్న కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతి నివ్వాలని బిసిసిఐ సెలక్షన్‌ కమిటీ భావిస్తుంది. దీంతో జట్టు పగ్గాలు రోహిత్‌ శర్మ తీసుకునే అవకాశం ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/