విరాట్‌ కోహ్లీకి సన్మానం రద్దు

న్యూఢిల్లీ : ఢిల్లీలో ని ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో బుధవారం భారత్‌ కు ఆస్ట్రేలియా కు మధ్య ఐదో వన్డే జరగనుంది. వన్డే మ్యచ్‌ ఆరంభానికి ముందు ఢిల్లీ లేజేండ్స్‌ క్రికెటర్లను ఘనంగా సన్మానించాలని గతంలో నే ఢిల్లీ క్రికేట్‌ అసోషియేషన్‌ (డీడీసీఏ) నిర్ణయించింది. మ్యాచ్‌కు ముందు విరాట్‌ కోహ్లీతో పాటు ఢిల్లీకి చేందిన మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌,గౌతమ్‌ గంభీర్‌లకు సన్మానం చేయాలని డీడీసీఏ భావించింది.పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్‌ -2019 ప్రారంభ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు డీడీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. తాము కూడా సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రజత్‌ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్పారు.ఢిల్లీ పోలీసు అమరవీరుల ఫండ్‌కు రూ.10లక్షలు విరాళం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చేప్పారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/