విరాట్ కోహ్లీ క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డో

brian lara, virat kohli & cristiano ronaldo
brian lara, virat kohli & cristiano ronaldo

విశాఖ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీని క్రికెట్లో క్రిస్టియానొ రొనాల్డొతో పోల్చాడు. గొప్ప నైపుణ్యంతో తన బ్యాటింగ్‌ను విరాట్ కోహ్లీ నమ్మశక్యం కాని స్థాయికి తీసుకెళ్లాడని లారా ఈ సందర్భంగా వెల్లడించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో లారా మాట్లాడుతూ “ప్రిపరేషన్‌తో సహా మరెన్నో లక్షణాలు విరాట్‌ కోహ్లీకి ప్రత్యేకంగా నిలిచేలా చేస్తున్నాయి. కేఎల్‌ రాహుల్‌ లేదా రోహిత్‌ కన్నా అతడు ప్రతిభావంతుడని నేను అనుకోను. కానీ, ఆట పట్ల అంకితభావం, కఠినంగా శ్రమించడం, మ్యాచ్‌కు సన్నద్ధం కావడం అతడిని మరోస్థాయికి తీసుకెళ్లాయి. నా వరకైతే అతడు క్రికెట్లో క్రిస్టియానొ రొనాల్డొ” అని కొనియాడాడు.
ఏ తరానికి చెందిన గొప్ప జట్లలోనైనా కోహ్లీకి స్థానం ఉంటుందని లారా చెప్పాడు. “కోహ్లీ శారీరక దృఢత్వం, మానసిక బలం నమ్మశక్యం కావు. అతడి బ్యాటింగ్‌ నైపుణ్యం అసమానం. అన్ని ఫార్మాట్లలో 50కి పైగా సగటు నమోదు చేయడం మాములు విషయం కాదు” అని లారా పేర్కొన్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/