“నాటు నాటు” సాంగ్ కు మైదానంలో కోహ్లీ డ్యాన్స్..

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు విరాట్ కోహ్లీ డాన్స్ చేసాడు. అది కూడా క్రికెట్ మైదానంలో…ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు సైతం దక్కింది. దీంతో తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ వరకు వెళ్ళింది.

తాజాగా ఈ సాంగ్ కు విరాట్ కోహ్లీ డాన్స్ చేసి వార్తల్లో నిలిచారు. భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యింది. అందులో భాగంగానే తాజాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ మధ్యలో నాటునాటు పాటకు విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోనే స్టెప్పులు వేసి అదరగొట్టాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకా దీనిపై అటు ఆర్ఆర్ఆర్ అభిమానులు, క్రీడాభిమానులు, ఇటు నెటిజన్లు లైకులు, కామెంట్లు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక కోహ్లీ వేసిన స్టెప్పుల వీడియో ఆర్ఆర్ఆర్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయింది..ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇద్దరూ కలిసి పఠాన్ మూవీ టైటిల్ ట్రాక్‌పై స్టెప్పేసిన సంగతి తెలిసిందే.. ఇందుకు సంబందించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి..ఇప్పుడు విరాట్ డ్యాన్స్ వీడియో కూడా వైరల్ అవుతుంది.