శాంటా తాతగా విరాట్‌ కోహ్లీ

virat kohli
virat kohli

కోల్‌కతా: క్రిస్మస్‌ పండగంటే చాలా మంది పిల్లలు సాంటా తాత వచ్చి బహుమతులెన్నో పంచి ఆశగా ఎదురుచూస్తు ఉంటారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి వారి కోసం సాంటా తాతలా మారిపోయాడు లెజెండరీ క్రికెటర్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఆటతో ఎప్పుడూ పుల్‌ బిజీగా ఉండే విరాట్‌ క్రిస్మస్‌ పండుగను ముందుగానే కొంతమంది పిల్లలతో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. సాంటా తాతలా వేషం వేసుకుని పిల్లలకు సర్‌ఫ్రైజ్‌ ఇచ్చాడు. క్రిస్మస్‌ సందర్భంగా వారికి బహుమతులు పంచి పెట్టాడు. వారితో కాసేపు సరదాగా గడిపిన విరాట్‌ కోహ్లీ పిల్లలతో ముచ్చటించి సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో విరాట్‌ కోహ్లీని పలువురు అభినందిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/