సెంచరీతో చెలరేగిన కోహ్లీ

58 పరుగులతో కోహ్లీకి అండగా ఉన్న రహానే

Virat Kohli
Virat Kohli

పుణె: దక్షిణాఫ్రికాతో పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. తన టెస్ట్ కెరీర్ లో 26వ శతకాన్ని బాదాడు. అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్ తో 2019లో తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. మరో ఎండ్ లో అజింక్యా రహానే నిలకడగా ఆడుతూ కోహ్లీకి అండగా నిలిచాడు. భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు. కోహ్లీ 104 పరుగులతో, రహానే 58 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీనికి ముందు మయాంక్ 108, రోహిత్ శర్మ 14, పుజారా 58 ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూడు వికెట్లను రబాడా తీశాడు. కోహ్లీ, రహానేల జోరుతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/