అత్యంత వేగంగా 20 వేల పరుగుల రికార్డు సాధించిన కోహ్లి

virat kohli
virat kohli, team india captain


మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ కలిపి అత్యంత వేగంగా 20 వేల పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. కోహ్లి 417 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును అందుకున్నాడు. అతడి కంటే ముందు సచిన్‌, రాహుల్‌ ద్రావిడ్‌లు ఈ ఘనత సాధించారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్‌, లారాలు 453 ఇన్నింగ్స్‌లలో, పాంటింగ్‌ 464, డివిలియర్స్‌ 483, కలిస్‌ 491, రాహుల్‌ ద్రావిడ్‌ 492 ఇన్నింగ్స్‌లలో 20 వేలపరుగులు సాధిస్తే, కోహ్లి 417 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును చేరుకున్నాడు.
30 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రిజులో విరాట్‌ కోహ్లి(53), ధోని(1)లు ఉన్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/