భూటాన్ లో పర్యటిస్తున్న విరుష్క జోడి

విరాట్ కోహ్లీ దంపతులను గుర్తుపట్టని స్థానికులు

Virat Kohli-Anushka Sharma -Bhutan
Virat Kohli-Anushka Sharma -Bhutan

భూటాన్‌: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా విరాట్, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనుష్క జంట ప్రస్తుతం ఆట నుంచి, సినిమాల నుంచి విరామం తీసుకుని భూటాన్ లో పర్యటిస్తున్నారు. అక్కడి మంచు కొండలు, పర్వతాల్లో పర్యటిస్తూ సేదదీరుతున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, అక్కడి స్థానికులు ఈ జంటను గుర్తు పట్టలేదు. ఎవరో ట్రెక్కింగ్ కోసం వచ్చారని భావించి, వారికి టీ ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా వెల్లడించిన అనుష్క, ఇలా సెలబ్రిటీ స్టేటస్ ను వదిలేసి తిరగడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని అనుష్క పేర్కొంది. తమను గుర్తించని ఓ అందమైన కుటుంబాన్ని చూశామని, వారి ఆతిథ్యం ఎంతో నచ్చిందని, కాసేపు వారితో మాట్లాడి, వారిచ్చిన టీ తాగామని చెప్పుకొచ్చింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/