సచిన్ రికార్డును బ్రేక్ చేయాలని కోహ్లి ఆరాటం

ఆడిలైడ్: టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ ఓడించి సిరీస్ కైవసం చేసుకోవాలని విరాట్ సేన ఉత్సాహంగా ఉంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న భారత్ ఈ సారి ఎలాగైనా సిరీస్ నెగ్గాలని పట్టుదలతో ఉంది. టెస్టు సిరీస్లో తొలి టెస్టు ఆడిలైడ్లోని ఓవల్ మైదానంలో డిసెంబరు 6న ఆరంభంకానుంది. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి రెండు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేసినట్లవుతుంది. ఆసీస్ గడ్డపై ఇప్పటి వరకు విరాట్ ఐదు టెస్టు సెంచరీలు చేశాడు. తొలి టెస్టులోనే కోహ్లి ఈ రికార్డును బ్రేక్ చేయాలని ఆశిస్తున్నాడు. ఆసీస్ పర్యటనలో సునీల్ గవాస్కర్ 5, వివిఎస్ లక్ష్మణ్ 4, అమర్నాథ్ 2 శతకాలు చేశారు.