నేటి నుంచి తిరుమ‌ల‌లో విఐపి దర్శనాలు రద్దు

Y V Subba Reddy
Y V Subba Reddy, TTD chairman

తిరుమల: టిడిపి నేత,మాజీ మంత్రి లోకేశ్‌ కామెంట్లపై టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..లోకేశ్‌లా తాను రాష్ట్రాన్ని దోచేయలేదని అన్నారు. స్వామి వారి డబ్బు రూపాయి కూడా ఖర్చుపెట్టనని, అవసరమైతే తర వద్ద ఉన్న డబ్బులే ఖర్చు పెడతానని ఆయన తెలిపారు. బుధవారం నుంచి L1, L2, ,L3 దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. 2012కి ముందు ఉన్న విధానాన్ని తీసుకువస్తామని, దర్శనాలను రద్దు చేయడం వెనుక రాజకీయ కారణాలు ఏమీ లేవని అన్నారు. ఈ విధానాల వల్ల దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని, త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

తాజా హీరోయిన్‌ ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/