విఐపి బ్రేక్ దర్శనాలపై ఏపి హైకోర్టు విచారణ

అమరావతి: తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలపై ఏపి హైకోర్టు విచారణ చేపట్టింది. ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలపై కోర్టుకు టిటిడి స్టాండింగ్ కౌన్సిల్ వివరణ ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్పై విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఐతే దీనిపై వాదనలు సోమవారం వింటామని హైకోర్టు తెలిపింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నీ సోమవారమే విచారిస్తామని వెల్లడించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/