రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు: టీటీడీ

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది. దీపావళి ఆస్థానం నిర్వహించనున్నందున పూజలకు ఇబ్బంది లేకుండా బ్రేక్‌ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇవాళ బ్రేక్‌ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/