న్యూఇయర్‌ వేడుకల్లో హింసాత్మక ఘటన

Violence in New Year celebrations
Violence in New Year celebrations

ఆదిలాబాద్‌: అంతటా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న నూతన సంవత్సర వేడుకల్లో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలో నూతన సంవత్సర వేడుకలు యువకులు హింసకు పాల్పడ్డారు. ఉట్నూర్‌ మండలం బోయవాడలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటున్న యువకులు ఒకరిపై ఒకరు పరస్పరం కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా విషమంగా ఉన్న వారిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/