లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు

Villagers boycott LS polls
Villagers boycott lok sabha election polls

తమిళనాడు :లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తమిళనాడులోని మేలసిరుపోతు గ్రామస్థులు  సమయంలో కీలక ప్రకటన చేశారు. తమ గ్రామంలో కనీస సౌకర్యాలు లేనందున లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలియచేశారు. అంతేకాకుండా నల్ల జెండాలు, చొక్కాలు ధరించి గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. 2017-18 సంవత్సరానికి చెందిన పంట బీమా డబ్బులు ఇంకా చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సరైన రోడ్లు, తాగు నీటి సౌకర్యాలు లేవన్నారు. అంతేకాకుండా పిల్లలు చదువుకోవడానికి పాఠశాల కూడా లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.

మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/