పంచాయతీరాజ్‌లో పనులు వేగవంతం

Village
Village

పంచాయతీరాజ్‌లో పనులు వేగవంతం

పంచాయతీరాజ్‌ శాఖలో పనులన్నీ చకచకా జరిగిపో తున్నాయి. ఇ-పాలన అమలు లోకి రావడంతో ఫైల్స్‌ అన్ని ఆన్‌లైన్‌లో వెంటవెంటనే పరిష్కా ర మవ్ఞతున్నాయి. కొన్ని ఫైళ్లకు నిమిషాల్లోనే సమాధానం వెళ్లి పోతోంది.గ్రామాలు కొత్త రూపును సంతరించుకుంటు న్నాయి. గ్రామీణ రోడ్డు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలకు, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామాన్ని పచ్చదనంతో నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు.

ఈ శాఖలో నిధులు పుష్కలంగా ఉన్నాయి. ఈ శాఖ మంత్రి నారా లోకేష్‌ తండ్రి మాదిరిగానే చాలా చురుకుగా వ్యవహరిస్తూ అధికారులతోను అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పనులు చేయిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బిటి రోడ్లకు రూ.400 కోట్లు కేటాయించి, రూ.73.43 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు.

6,039 కిలోమీటర్ల పొడవైన సిమెంట్‌ రోడ్లు నిర్మించారు. 3,113 అంగన్‌ వాడీ కేంద్రాలు, 451 గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 48 స్త్రీ శక్తి 66 చేప పిల్లల పెంపకం చెరువ్ఞల పనులు, 80 చేపలు ఎండబెట్టే ఫ్లాట్‌ ఫారాల పనులు పూర్తి చేశారు. 669 స్మశానాలను అభివృద్ధి చేశారు. చంద్రకాంతి పేరుతో దేశంలోనే మొట్టమొదటగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఎల్‌ఈడి దీపాల ప్రాజెక్ట్‌ కింద ఈ ఏడాది చివరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఎల్‌ఈడి బల్పులు అమరుస్తారు. 23.90 లక్షల ఎల్‌ఈడి బల్బులు అమర్చాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో 12.84 లక్షల బల్బులు ఏర్పాటు చేయగా, 3,701గ్రామ పంచాయతీల్లో వంద శాతం బల్బులు ఏర్పాటు చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు రూ.420 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించి, ఇప్పటి వరకు రూ.32.15 కోట్ల విలువైన పనులు చేశారు. 2 వేల గ్రామ పంచాయతీల్లో ఈ తయారీ కేంద్రాలను నిర్మించారు. గత సంవత్సరం 759 కేంద్రాలు నిర్మించారు. ఈ ఏడాది చివరకు 9 వేల గ్రామాల్లో ఈ కేంద్రాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు.

వాటర్‌ షెడ్‌ పథకం కింద రూ.421 కోట్లతో చెక్‌ డ్యాంలు, ఊట కుంటలు, నీటి నిల్వ కట్టడాలు వంటి పనులు చేపట్టాలని నిర్ధేశించారు ఎన్టీఆర్‌ జలసిరి పేరుతో ఎస్సీఎస్టీలకు చెందిన బోరు బావ్ఞలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించి దాదాపు 70 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నా రు. ఈ పథకం కింద 15 వేలకు పైగా సోలార్‌ పంపుసెట్లు అమర్చి 70వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. పంచా యతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అనుసంధానంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎస్‌- మహాత్మాగాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ స్కీమ్‌) ప్రణాళికను రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరం (2018-19)లో వేతనాల కింద రూ.6 వేల కోట్ల చెల్లించేలా, మెటీరియల్‌ వాటా కింద రూ.5వేల కోట్లు సాధించేలా పనులు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే అనుసంధాన శాఖల నుంచి రూ.2,809 కోట్ల నిదులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.4940 కోట్ల ఖర్చుతో ఉపాధి హామీ, ఇతర పనులు చేపట్టాలని నిర్ణయించి ఇప్పటి వరకు రూ.2669 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు.

పంచాుతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంతో కలిసి రూ.2337 కోట్లు విలువైన పనులు చేయాలని నిర్ణయించారు. రూ.467.39 కోట్ల విలువైన పనులు చేశారు. గిరిజన సంక్షేమ శాఖతో కలిసి రూ.242 కోట్లతో పనులు చేయాలని నిర్ణయించి, రూ.51.47 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఐసిడిఎస్‌తో కలిసి రూ.310 కోట్లతో పనులు చేపట్టి రూ.15.52 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. గృహ నిర్మాణ శాఖతో రూ.2740 కోట్లతో పనులు చేయాలని నిర్ణయించి, రూ.97,47 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌తో కలసి రూ.5.4 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌-సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పోవర్టీ)తో కలిసి రూ.79.43 కోట్లు, అటవీ శాఖతో కలిసి రూ.42.3 కోట్లు, పశుసంవర్ధక శాఖతో కలిసి రూ.11.7 కోట్లు, పట్టు పరిశ్రమల శాఖతో కలిసి రూ.5.81 కోట్లు,

మత్స్య శాఖతో కలిసి రూ.15.11 కోట్లు, శాప్‌ (ఎస్‌ఎఎపి-స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌)తో కలిసి రూ.3.22 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు 179 పాఠశాలలో ఆట స్థలాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పశువ్ఞలకు 608 నీటి తొట్టెలు నిర్మించారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పేరిట 16,892 ఎకరాల్లో గడ్డిని పెంచుతున్నారు. గడిచిన ఆర్థికసంవత్సరంలో 71,437 ఇటుకల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి,1,43, 171 మందికి లబ్ధి చేకూర్చారు. ఈ విధంగా గ్రామీణాభివృ ద్ధికి, గ్రామీణులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి పంచాయితీరాజ్‌ శాఖ విశేష కృష్టి చేస్తోంది.

– శిరందాసు నాగార్జున