‘పూరి జగన్నాథ్ అంటే నాకు అసూయ’

ఆలీ షోలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ హాస్య ఛలోక్తి..

K. V. Vijayendra Prasad
K. V. Vijayendra Prasad

‘బాహుబలి’తో ప్రపంచగుర్తింపు తెచ్చుకున్న ‘దర్శకధీరుడు’ రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్.. తనయుడి ప్రతీ విజయంలో ఉన్నారాయన తెలుగుసహా తమిళ కన్నడ హిందీ భాషల్లో మంచి కథలను అందిస్తూ పాన్ ఇండియా రైటర్ గా మారిపోయారు , పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. కాగా నటుడు ఆలీ హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమానికి హాజరై పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి కాకుండా మీకు నచ్చిన డైరక్టర్ ఎవరు?’ అని అలీ అడగ్గా , విజయేంద్రప్రసాద్ సమాధానం చెబుతూ.. ”పూరి జగన్నాథ్. ఆయన అంటే నాకు అసూయ. నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్నా” అని నవ్వుతూ అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/