రాంగోపాల్‌ వర్మకు నోటీసులు జారీ

Ram Gopal Varma
Ram Gopal Varma

విజయవాడ: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు విజయవాడ నార్త్‌ ఏసిసీ రమేశ్‌బాబు నోటీసు జారీ చేశారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాపై విజయవాడ పాయకాపురం పైపులరోడ్డు కూడలిలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు బహిరంగ విలేకరుల సమావేశం నిర్వహిస్తానని ప్రకటించినదుకుగాను ఈ నోటిసులు జారీ చేశారు.
 ఈ సందర్భంగా పోలీసులు రాంగోపాల్‌వర్మకు కొన్ని అంశాలను తెలియజేస్తూ రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.
• బహిరంగ ప్రదేశంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో రాంగోపాల్‌వర్మను వ్యతిరేకించే వర్గం కార్యక్రమాన్ని అడ్డుకోవచ్చన్నారు. దీని వల్ల ఘర్షణలు, ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. విలేకరుల సమావేశం నిర్వహించే స్థలంపై పునరాలోచించి ప్రెస్‌ క్లబ్‌లో లేదా ఏదైనా సమావేశ మందిరంలో నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
• విజయవాడ నగర పరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌యాక్ట్‌, 144 సెక్షన్‌ అమలు, ఎన్నికల కోడ్‌ అమలులో ఉందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతించమన్నారు.
•పైపులరోడ్డు విజయవాడ-హైదరాబాద్‌ ప్రధాన మార్గం కావటంతో నిత్యం రద్దీగా ఉంటుందని, అత్యవసర సర్వీసులు తిరిగే ఈ మార్గంలో విలేకరుల సమావేశంతో ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగే అవకాశం ఉందన్నారు.
• 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పైపులరోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో గ్రూప్‌ 1 పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని శాంతిభద్రతలను కాపాడటంలో సహకరించాలని రాంగోపాల్‌వర్మకు పంపిన నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.


క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/