ఏపీలో బిఆర్ఎస్ కు పెరుగుతున్న మద్దతు..మరో కీలక వ్యక్తి జాయిన్

తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించిన బిఆర్ఎస్ పార్టీ కి ఏపీలో మద్దతు పెరుగుతుంది. రోజు రోజుకు భారీగా వలసలు చేరుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ ముందు నిలిచారు. ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చారు..సీఎం అయ్యారు. ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా తెలంగాణ కు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చారు. ఎన్నో పధకాలు , అభివృద్ధి , భారీగా పెట్టుబడులు ఇలా ఎన్ని అభివృద్ధి జరుగుతుండడం తో మిగతా రాష్ట్రాలు కూడా కేసీఆర్ వైపు చూడడమే కాదు మద్దతు పలుకుతున్నారు.

ఇక టిఆర్ఎస్ ను కాస్త బిఆర్ఎస్ గా మర్చి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్…మిగతా రాష్ట్రాల్లో కూడా బిఆర్ఎస్ ను విస్తరిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే పలువురు కీలక నేతలు బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని , కార్యక్రమాల్లో పాల్గొంటుండగా..తాజాగా మరో కీలక వ్యక్తి బిఆర్ఎస్ లో చేరి మద్దతు పలికారు. గురువారం విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల పార్టీ కండువా కప్పుకున్నారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో తాడి శకుంతలతోపాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మల్యాద్రి సహా పలువురు మైనారిటీ నేతలు పార్టీలో చేరారు. విజయవాడ మెగల్రాజపురానికి చెందిన తాడి శకుంతల 2005-06లో ఏడాది పాటు నగర మేయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీల్లోనూ కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ నాయకురాలిగా మారారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో బిఆర్ఎస్ పోటీ చేయబోతోందని , ఎన్నికల సమయానికి భారీ ఎత్తున రాజకీయ నేతలు బిఆర్ఎస్ లో చేరతారని బిఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.