విజయవాడలోని సినిమా థియేటర్ లో అగ్నిప్రమాదం

షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని నిర్ధారణ

Fire
Fire

Vijayawada: విజయవాడలోని ఒక సినిమా థియేటర్ లోఅగ్నిప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత ఈ సంఘటన జరిగింది.

షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

గత కొంత కాలంగా థియేటర్ మూతపడి ఉండటం, ప్రమాదం సంభవించిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు.

అయితే ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంపై జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/