‘మహాత్మా మన్నించండి’ అంటూ విజయశాంతి ట్వీట్
నాగబాబు ట్వీట్ పై విజయశాంతి

హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సే ‘నిజమైన దేశ భక్తుడు’ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈట్వీట్ పై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్, సీనియర్ నటి విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ‘కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే… 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే… ఈశ్వర్, అల్లా… తేరానామ్… సబ్ కో సన్మతి దే భగవాన్… ”నాకు కూడా”…”అని” గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే… ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు. మన్నించండి మహత్మా’ అని ట్వీట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/