కేసీఆర్‌పై విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు

తెలంగాణను ఉద్ధరిస్తారంటే చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితి లేదు

హైదరాబాద్: బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి సీఎం కెసిఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ చెప్పేది ఒక‌టి.. చేసేది మ‌రొక‌టి అని ఆమె ఎద్దేవా చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా త‌నిఖీ చేస్తాన‌ని కేసీఆర్ చెప్పిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆ ప‌ని చేయ‌బోర‌ని అన్నారు.

‘తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా చెకింగ్ చేస్తానని, చెప్పకుండా వచ్చి పరిశీలిస్తానని అన్నారు. ఆఫీసర్లు అందుబాటులో ఉండి తానడిగిన రిపోర్టులివ్వాలని… తేడా వస్తే స్పాట్‌లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీరియస్‌గా హెచ్చరించారు. సీఎం మాటలకు భయపడాల్సిన పనిలేదని అధికారులకు బాగా తెలుసు. ఎందుకంటే, ఆయన ఒక మాట అన్నారంటే, అది జరిగే పని కాదని అందరికీ తెలుసు. వస్తున్నా వస్తున్నా అనడమే గాని… ఓట్ల పండగప్పుడు తప్ప ఫాంహౌస్, ప్రగతి భవన్ వదిలి కేసీఆర్ రారని అందరికీ బాగా అర్థమైంది. అంటూ విజ‌య‌శాంతి విమర్శించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/