తెలంగాణలో వ్యాధులు ముసురుకుంటున్న ప్రభుత్వం నిర్లక్ష్యమేనా?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల్లేక జనం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నరన్నా విజయశాంతి

Vijayashanti
Vijayashanti

హైదరాబాద్‌ః బీజేపీ నేత విజయశాంతి సిఎం కెసిఆర్‌ మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో వ్యాధులు ముసురుకుంటున్నాయని.. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదని ఆమె అన్నారు. కేసీఆర్ పేరుకు మాత్రం చెప్పేది బంగారు తెలంగాణ‌ అని.. కానీ ఆయన పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు చేశారు. తెలంగాణ‌లో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని.. భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు.

కేసీఆర్ పేరుకు మాత్రం చెప్పేది బంగారు తెలంగాణ‌ అని.. కానీ ఆయన పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో వరుసగా ట్వీట్లు చేశారు. తెలంగాణ‌లో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని.. భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు.

‘‘గ్రామాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కానీ భారీగా డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆస్పత్రుల్లో వైద్యం సరిగా అందడం లేదు. ప్రజలకు మరో దిక్కులేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆస్పత్రులు అందినకాడికి దోచుకుంటున్నాయి. టెస్టుల పేరుతో వేలకువేలు గుంజుతున్నాయి. డెంగీ బాధితులను ప్లేట్ లెట్లు తగ్గాయని భయపెడుతూ దోపిడీ చేస్తున్నాయి. ఇంత జ‌రుగుతున్నా కేసీఆర్ స‌ర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది” అని విజయశాంతి మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని ప్రజలకు సరైన వైద్యం అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో ఆడుకుంటున్న కేసీఆర్ స‌ర్కారుకు తెలంగాణ ప్ర‌జానీక‌ం కచ్చితంగా బుద్ధి చెబుతుందని వ్యాఖ్యానించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/