రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి

Vijayashanti
Vijayashanti

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ మహిళ నేత విజయశాంతి, కోనేరు కృష్ణ దాడి చేసి గాయపరిచిన ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితను ఫోన్ లో పరామర్శించారు. ఆపై తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని ఆమె అన్నారు. మహిళా ఉన్నతాధికారులకే రక్షణ లేకుండా పోయిందని, అసలు పాలనే సక్రమంగా సాగడం లేదని ఆరోపించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు పాలన ఉందా? ముఖ్యమంత్రి ఆడంబరాలకు పరిమితం అయ్యారు. రాష్ట్రంలో దొంగలు రాజ్యమేలు తున్నారు అని విజయశాంతి విమర్శలు గుప్పించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/