టిఆర్‌ఎస్‌ నేతల పేర్లు బయటకు రాలేదు

ఇది కెసిఆర్‌ సర్కారు మరో డ్రామా

Vijayashanti
Vijayashanti

హైదరాబాద్‌: గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులోని వివరాలను నిన్న ఆర్టీఐ చట్టం కింద ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటకు తీసుకురాగా, ఆ గ్యాంగ్ లో భాగమైన అసలు టిఆర్‌ఎస్‌ నేతల పేర్లు బయటకు రాకుండా కెసిఆర్‌ ప్రభుత్వం జాగ్రత్త పడిందని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి ఆరోపించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మరో నాటకాన్ని మొదలు పెట్టిందని విమర్శలు గుప్పించారు.గ్యాంగ్ స్టర్ నయీమ్ డైరీలో ప్రస్తావించిన పేర్లు అనే అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి కుదిపేస్తోంది. ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించేందుకు కెసిఆర్‌ ప్రభుత్వం ఇలాంటి నాటకాలు ఆడటం ఇది కొత్త కాదు. నయీమ్ డైరీ లో పేర్కొన్న పేర్లకు సంబంధించి వివరాలు పత్రికల్లో వచ్చాయి. కానీ ఈ వివరాలలో కూడా చాలావరకు ఎడిటింగ్ జరిగినట్టు కనిపిస్తోంది. విజయశాంతి ఆరోపించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/