సీఎం కేసీఆర్ సరికొత్త డ్రామా: విజయశాంతి

Congress leader Vijayashanti
Vijayashanti

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికి రెడ్డి అవుతున్నాడు. ప్రశాంత్ కిశోర్ తో కలిసి నిరుద్యోగుల విషయంలో సరికొత్త డ్రామా షూరూ చేసిండు. అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ప్రకటన పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. గతంలో 4 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడేమో కేవలం 80 వేల ఉద్యోగాలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నాడు. ఎన్నో రోజుల నుండి నిరుద్యోగులు ఆందోళనలు చూస్తుంటే చూస్తు ఊరుకున్న సీఎంకి ఇప్పుడే ఉద్యోగాల భ‌ర్తీ ఎందకు గుర్తొచ్చిందంటే.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌బోతున్నాడు, కాకున్నా వారి ఓట్ల కోసం కొత్త ఉద్యోగాలంటూ కొత్త రాగం పాడుతున్నాడు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఉద్యోగాలంటూ ఆర్భాటం చేస్తున్నాడు.

ఏడాదిన్నర క్రితం 1.91 లక్షల ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికి ఆ ఖాళీలు 3 లక్షలకు పెరిగాయి. ఇప్పుడు ప్రకటించిన 80 వేల ఉద్యోగాలకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. దేశంలో బీజేపీ చేసినా అభివృద్ధిని చూసి భయపడి నక్క జిత్తుల వేషాలు వేస్తున్నాడు. నాలుగు రాష్ట్రాల్లో కాషాయం జెండా ఎగరడం త‌ట్టుకోలేక ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడు. కేసీఆర్ నీ నాట‌కాల‌ను ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోరు, అని విజయశాంతి సీఎం కెసిఆర్ పై మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/