రాజధానిపై ఏ అర్హతతో విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు?

kuna ravi kumar
kuna ravi kumar

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వంపై టిడిపి మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..విజయసాయిరెడ్డికి ఏమి అర్హత ఉందంటూ రాజధానిపై మాట్లాడుతున్నారని కూన రవికుమార్‌ విమర్శించారు. ప్రభుత్వంలో ఆయన పాత్ర ఏంటని ప్రశ్నించారు. ఏ అధికారంతో అయితే ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటిస్తున్నావో అదే అధికారంతో విశాఖలో ల్యాండ్‌ గ్రాబింగ్‌ పాల్పడుతున్నారని ఆరోపించారు. విశాఖలో పులివెందుల పంచాయతీలో చేయడానికి దండుపాలెం బ్యాచ్‌ వస్తోందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరుతో విశాఖలో సొంత ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులన్న తేడా లేకుండా దోచుకుపోతున్నారని కూన మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల వెనుకబడిన ప్రాంతాలకు ఏమీ జరగదని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని, ధర్మాన ప్రసాద్‌రావు సుదీర్ఘకాలంగా మంత్రులుగా పనిచేసినా శ్రీకాకుళం ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదని కూన రవికుమార్‌ ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/