విజయసాయిరెడ్డి పెద్ద ట్విట్టర్‌ వీరుడు

టిడిపి నేత వర్ల రామయ్య

varla ramaiah
varla ramaiah

అమరావతి: ఏపిలో టిడిపి, వైయస్‌ఆర్‌సిపి మద్య విమర్శల పర్వం కొనసాగతుంది. తాజాగా వైయస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కరోనాపై చేసిన ట్విట్లపై టిడిపినేత వర్ల రామయ్య వ్యంగ్యంగా స్పందించారు. విజయసాయిరెడ్డి గారు పెద్ద ట్విట్టర్‌ వీరుడు. ఆయన ట్వీట్లు అన్ని అబద్దాలే. నమ్మశక్యం కానివి. లేకపోతే రాష్ట్రంలో కరోనా విపరీతంగా పెరిగిపోతున్నదని ఆందోళన చెందుతుంటే, మన రాష్ట్రంలో కరోనా కట్టడి బాగా చేసారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించినట్లు బాక ఊదుతారు. ఈ ప్రభుత్వానికి పెద్ద విదూషకుడీయన. అంటూ రామయ్య ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/