ప్రజలకు రాహుల్ ముఖం చూపించలేకపోతున్నారంటూ విజయసాయి సెటైర్లు

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ని ఈడీ అధికారులు సోమవారం విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. ఈడీ సమన్ల ఫై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు , నిరసనలు తెలియజేయగా..వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం ట్విట్టర్ ద్వారా రాహుల్ ఫై సెటైర్లు వేశారు.

క‌ర్మ ఫ‌లం ఎక్క‌డికి పోతుంది అన్న‌ట్లుగా అర్థం వ‌చ్చేలా సాగిన ఆ పోస్టులో… ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత జ‌నానికి రాహుల్ గాంధీ ముఖం చూపించ‌లేక‌పోతున్నార‌ని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా 2024 ఎన్నిక‌ల త‌ర్వాత అస‌లు జ‌నంలోకి రావాలంటే రాహుల్ గాంధీకి ఏకంగా పీపీఈ కిట్ అవ‌స‌ర‌మ‌వుతుందేమోనంటూ మ‌రో కామెంట్ చేసి , త‌న సోద‌రి ప్రియాంకా గాంధీ తోడు రాగా ఈడీ ఆఫీస్‌కు బ‌య‌లుదేరిన రాహుల్ గాంధీ ఫొటోను జ‌త చేసాడు విజయసాయి.

ఇక విజయసాయి చేసిన ఈ ట్వీట్ ఫై కాంగ్రెస్ కార్యకర్తలు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ అర్హ‌త ఉంద‌ని రాహుల్ గాంధీని ఇలా విమ‌ర్శిస్తున్నార‌ని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నిస్తే… ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌ర‌దాల మాటున ప‌ర్య‌ట‌న‌లు సాగిస్తున్నారు క‌దా అంటూ మ‌రో నెటిజ‌న్ దెప్పి పొడిచారు. ‘ఎందుకైనా మంచిది, మీరు ఓ డ‌జ‌న్ పీపీఈ కిట్లు ద‌గ్గ‌ర పెట్టుకోండి’ అంటూ ఆ నెటిజ‌న్ సాయిరెడ్డిపై పంచ్ సంధించారు.

ఇక రాహుల్ ను మొదటి రోజు దాదాపు 10 గంటల పాటు విచారించారు. రేపు మరోసారి ఈడీ ముందుకు రావాలని సమన్లు జారీచేశారు.

“Karma”….After Punjab, UP, Uttarakhand and Goa election drubbing, @RahulGandhi is finding it hard to show his face in public. I am sure he will need a full body PPE kit after 2024 general election. pic.twitter.com/yksCbbOeUF— Vijayasai Reddy V (@VSReddy_MP) June 13, 2022